News February 1, 2025
MNCL: ‘మీవి ఖాళీ భూములా.. సోలార్ ప్లాంట్ వేసుకోండి’
బంజరు, వ్యవసాయానికి అనుకూలంగా లేని భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ మంచిర్యాల సర్కిల్ ఎస్ఈ గంగాధర్ కోరారు. సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను టీజీఆర్ఈసీ నిర్ణయించిన టారిఫ్ ప్రకారం టీజీఎన్పీడీసీఎల్ కొనుగోలు చేస్తుందన్నారు. వివరాలకు 6304903933, 9000550974 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 1, 2025
శ్రీకాకుళం: నిమ్మాడ హైవేపై కారు బోల్తా
కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారు ముందు టైరు పేలడంతో డివైడర్‌ని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలు అయ్యాయి. స్థానికులు సహాయంతో కారుని రోడ్డు పక్కన ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించారు.
News February 1, 2025
రేవంత్.. దమ్ముంటే HYD పేరు మార్చండి: బండి సంజయ్
TG: BJP ఆఫీసున్న వీధి పేరును గద్దర్ పేరిట మారుస్తానని CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘పద్మ అవార్డు ఇవ్వనందుకు ఓ వీధి పేరు మారుస్తానని CM అనడం చూస్తుంటే నవ్వొస్తోంది. గద్దర్‌పై కేసులు పెట్టింది, అవమానించింది కాంగ్రెస్ పార్టీయే. రేవంత్‌కు దమ్ముంటే ముందుగా HYD పేరును భాగ్యనగర్‌గా, NZB పేరును ఇందూరుగా, MBNR పేరును పాలమూరుగా మార్చాలి’ అని X వేదికగా సవాల్ విసిరారు.
News February 1, 2025
మద్దిలపాలెంలో వ్యభిచార గృహంపై దాడి
విశాఖలో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు MVP పోలీసులు తెలిపారు. మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో MVP పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ రైడ్‌లో వ్యభిచార గృహం నడిపిస్తున్న సంతోశ్ కుమార్, విటుడు పెందుర్తికి చెందిన కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.