News February 1, 2025
MNCL: ‘మీవి ఖాళీ భూములా.. సోలార్ ప్లాంట్ వేసుకోండి’
బంజరు, వ్యవసాయానికి అనుకూలంగా లేని భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ మంచిర్యాల సర్కిల్ ఎస్ఈ గంగాధర్ కోరారు. సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను టీజీఆర్ఈసీ నిర్ణయించిన టారిఫ్ ప్రకారం టీజీఎన్పీడీసీఎల్ కొనుగోలు చేస్తుందన్నారు. వివరాలకు 6304903933, 9000550974 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News February 1, 2025
ఇండోనేషియా అమ్మాయితో గుండ్రాంపల్లి యువకుడు పెళ్లి
చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన అబ్బాయి ఇండోనేషియాకు చెందిన అమ్మాయి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సీమ సాలయ్య-యాదమ్మల కుమారుడు నాగరాజు హైదరాబాద్లోని సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇండోనేషియాకి చెందిన రిక్కి సన్డా సెఫిట్రి అదే కంపెనీలో పనిచేస్తోంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇటీవల బంధువులు సమక్షంలో ఒక్కటయ్యారు.
News February 1, 2025
క్యాన్సర్ మందులపై పూర్తిగా కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత
కస్టమ్స్ డ్యూటీలో కీలక మార్పులు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. క్యాన్సర్, ఇతర ప్రమాదకర వ్యాధుల మెడిసిన్లపై పూర్తిగా కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు.
News February 1, 2025
2047కల్లా 100 GW అణు విద్యుత్ లక్ష్యం: నిర్మల
2047కల్లా కనీసం 100 గిగావాట్ల అణువిద్యుత్‌ను అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ‘చిన్న చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు రూ.20వేలకోట్లతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ రంగంతో క్రియాశీల భాగస్వామ్యం కోసం అణుశక్తి చట్టానికి, అణుశక్తి పౌర బాధ్యత చట్టానికి సవరణలు చేస్తాం’ అని స్పష్టం చేశారు.