News January 28, 2025

MNCL: మెడికల్ కార్డు పొందేందుకు మరో అవకాశం

image

బొగ్గు గని రిటైర్డ్ కార్మికులకు మెడికల్ కార్డు పొందడానికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు జాతీయ సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం రాయపూర్‌లో జరిగిన 6వ బోర్డు సమావేశంలో కంట్రీబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్‌ను మార్చి 31వరకు రూ.60వేల కంట్రిబ్యూషన్‌తో ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మెడికల్ కార్డు పొందని రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 15, 2025

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ

image

అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు అధికారులు ఉక్కు పాదం మోపాలని జిల్లా SP ఏఆర్ దామోదర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన సోమవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను వివరించి, నిర్వహించాల్సిన విధుల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని ఆయా సబ్ డివిజన్ల పరిధిలో ప్రధాన నేరాలు, శాంతి భద్రతల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

News September 15, 2025

శ్రీకాకుళం-విశాఖకు ఈ రైళ్లు నడవనున్నాయి

image

శ్రీకాకుళం జిల్లా వాసులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. విశాఖ-బ్రహ్మపూర్-విశాఖపట్నం(18525/26) రైలును ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. మరలా సేవలను పునరుద్ధరించినట్లు తాజాగా వెల్లడించింది. పలాస-విశాఖ(67290) మెము రైలును విశాఖ వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇవి శ్రీకాకుళం రోడ్డు, పొందూరు, నౌపడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర స్టేషన్లు మీదుగా నడవనున్నాయి.

News September 15, 2025

విశాఖలో ‘స్వస్త్ నారి-సశక్త్ పరివార్’ అభియాన్

image

విశాఖ జిల్లాలో మహిళల ఆరోగ్యం కోసం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు “స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ జగదీశ్వరరావు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్, గర్భిణుల పరీక్షలు, పిల్లలకు టీకాలు వేస్తారన్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.