News April 4, 2024
MNCL: మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి అరెస్ట్

మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు MNCL CI బన్సీలాల్ తెలిపారు. మార్చి 28న 10th పరీక్షలు రాస్తుండగా బాలిక కనిపించడం లేదని ఆమె తల్లి సంతారు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాంత్(27)అనే వ్యక్తి ఆమెను బలవంతంగా వేములవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి తిరుపతికి తీసుకెళ్తుండగా ఆమె తప్పించుకొని వచ్చినట్లు వెల్లడించారు.
Similar News
News September 19, 2025
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు పదోన్నతి

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు సైతం పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తిరిగి యధా స్థానంలో అదనపు ఎస్పీగా కొనసాగనున్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
News September 19, 2025
క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ SP

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్‌ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్‌గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.
News September 19, 2025
తలమడుగు: కలప అక్రమ రవాణా

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాపూర్ సమీపంలోని MS గార్డెన్‌లో సిబ్బంది తనిఖీలు చేశారు. రూ.84 వేల విలువైన టేకు కలప దొరికినట్లు చెప్పారు. కలపను జప్తు చేసి యజమాని మొహమ్మద్ మూసా, లక్షణ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.