News March 1, 2026
MNCL: ‘రాయితీపై డ్రోన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలి’

మంచిర్యాల జిల్లాలో రాయితీపై డ్రోన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ తెలిపారు. 2025- 26 సంవత్సరానికి గాను జిల్లాకు 10 వ్యవసాయ డ్రోన్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో మంచిర్యాల డివిజన్ కు 3, చెన్నూర్ కు 3, బెల్లంపల్లికి 2, భీమినికి 2 డ్రోన్లు కేటాయించామన్నారు. తెలిపారు. ఈ డ్రోన్లను 40 శాతం (రూ.4 లక్షల) రాయితీపై అందించనునట్లు తెలిపారు.
Similar News
News March 2, 2026
అనకాపల్లి: కలెక్టర్‌ను కలిసిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రతినిధులు

నక్కపల్లిలో అర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ సీఈవో దిలీప్ ఒమెన్, ప్రాజెక్ట్ చీఫ్ కేఎల్ చౌదరి, హెచ్ఆర్ డైరెక్టర్ అశుతోష్ సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్‌ను కలిశారు. నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆమెతో చర్చించారు. భూ సమీకరణ, పునరావాస కాలనీల అభివృద్ధి, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, నీటి సరఫరా కోసం పైప్ లైన్ల నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్ వారితో సమీక్షించారు.
News March 2, 2026
అర్జీల పట్ల నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

అనకాపల్లి జిల్లా కలెక్టరెట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు-128, రెవెన్యూ క్లినిక్‌కు 173 అర్జీలు వచ్చాయని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. అర్జీదారుల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు.
భూసంబంధిత సమస్యలను రెవిన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రజలతో నేరుగా మాట్లాడాలని కలెక్టర్ సూచించారు.
News March 2, 2026
హోలీ శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి కలెక్టర్

రంగుల పండుగ హోలీ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ ప్రతి ఇంటా ఆనందం, ఐక్యత నింపాలని ఆకాంక్షించారు. రసాయన రంగులు ఉపయోగించకుండా సహజ రంగులతో పండుగ జరుపుకోవాలని సూచించారు. చిన్నారులు పెద్దల పర్యవేక్షణలో ఆడాలని, చెరువులు, వాగుల్లో స్నానాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. శాంతి భద్రతలు కాపాడుతూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.


