News February 4, 2025

MNCL: రాష్ట్రస్థాయి క్రీడల్లో కమిషనరేట్‌కు 3వ స్థానం

image

కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో రామగుండం పోలీస్ కమీషనరేట్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో మూడవ స్థానం లభించింది. ఈ సందర్భంగా పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు సోమవారం సీపీ ఎం. శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలవగా.. ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించడం పట్ల అభినందించారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో రాణించి కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలన్నారు.

Similar News

News February 4, 2025

స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!

image

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

News February 4, 2025

గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి

image

జన్నారం మండల అదనపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) గుండెపోటుతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం ఏంద గ్రామం. ప్రస్తుతం జన్నారం మండలం ఇంధన్ పల్లిలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. తానాజీ మృతి పట్ల లక్షెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

News February 4, 2025

PGECET, ICET షెడ్యూల్ ఇదే

image

TG: ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే PGECET నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానుంది. అదే నెల 17-19 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు ఉండనున్నాయి.

☛ MBA, MCA తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET నోటిఫికేషన్ మార్చి 6న రిలీజ్ కానుంది. అదే నెల 10 నుంచి మే 3 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. జూన్ 8, 9న పరీక్ష ఉంటుంది.