News November 1, 2025
MNCL: రేపు జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ ఎంపిక పోటీలు

మంచిర్యాల ZPHSబాలుర పాఠశాల మైదానంలో ఆదివారం జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ సీనియర్ పురుషులు, మహిళల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం సెక్రటరీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ధ్రువపత్రాలతో రేపు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
Similar News
News November 1, 2025
ఎల్ఈడీ యూనిట్లను పర్యావరణహితంగా నిర్వహించండి: కలెక్టర్

ఎల్ఈడీ యూనిట్లను పర్యావరణహితంగా నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరంలోని ఎల్ఈడీ బల్బులు, లైట్ల తయారీ యూనిట్‌ను ఆయన పరిశీలించారు. వాయు, నీటి కాలుష్యాలను నివారించాలని, పర్యావరణానికి హాని కలిగించకుండా చూడాలని నిర్వాహకులకు సూచన చేశారు. తమ యూనిట్‌లో పలు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన బల్బులను తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
News November 1, 2025
గుంటూరులో ఈ నెల 7న జాబ్ మేళా

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఈ నెల 7న గుంటూరు లాం చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ చదువుకున్న విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు.
News November 1, 2025
సూపర్ ఫామ్‌లో కివీస్.. వరుసగా 10 వన్డే సిరీస్‌లు కైవసం

ODI క్రికెట్‌లో న్యూజిలాండ్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తోంది. సొంతగడ్డపై 2019 నుంచి వరుసగా 10 ODI సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఇవాళ ENGపై మూడో వన్డేలో గెలిచి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఈ ఘనత సాధించింది. మెన్స్ ODI క్రికెట్‌లో ఇది సెకండ్ లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్. చివరగా IND చేతిలో ఓడిన కివీస్ ఆ తర్వాత దూసుకుపోతోంది. కాగా 2002-07 మధ్య వరుసగా 17 వన్డే సిరీస్‌లు గెలిచిన సౌతాఫ్రికా టాప్‌లో ఉంది.


