News August 18, 2025

MNCL: రైలులో ప్రయాణిస్తూ వ్యక్తి మృతి

image

రైలులో ప్రయాణిస్తూ ఒక వ్యక్తి మృతి చెందాడు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన ధన్పత్ లాల్ యాదవ్ తమిళనాడులో పనిచేసేందుకు గ్రామస్తులతో కలిసి రైలులో వెళుతుండగా అస్వస్థతకు గురయ్యాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతదేహాన్ని మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో దింపగా.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News August 18, 2025

ప్రకాశం జిల్లాలో మరో 4లైన్ రహదారి.!

image

ప్రకాశం జిల్లా వాసుల కోసం రహదారి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంగోలు సమీపంలోని త్రోవగుంట నుంచి కత్తిపూడి వరకు గల 250 కిలోమీటర్ల రహదారిని 4 లైన్లుగా విభజించేందుకు నేషనల్ హైవే అథారిటీ నిర్ణయించింది. నేషనల్ హైవే 216గా గుర్తించి ఈ రహదారిని 4 లైన్ల రహదారిగా మార్చనున్నారు. ఈ దారి ఒంగోలు నుంచి బాపట్ల, బాపట్ల నుంచి పెడన, పెడన నుంచి లక్ష్మీపురం, కత్తిపూడి వరకు వెళ్తుంది.

News August 18, 2025

యూరియా వినియోగంపై నిఘా ఉంచాలి: కలెక్టర్

image

యూరియా వినియోగంపై అధికారులు నిఘా ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశించారు. జిల్లాకు ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, మొత్తం 29,527 మెట్రిక్ టన్నుల యూరియా లభ్యత ఉందన్నారు. 26,008 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించగా, ఇంకా 3,519 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.

News August 18, 2025

VZM: ప్రజల నుంచి 27 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 27 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. భూ తగాదాలకు సంబంధించి 7, కుటుంబ కలహాలకు సంబంధించి 5, మోసాలకు పాల్పడినట్లు 4, ఇతర అంశాలకు సంబంధించి 11 ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.