News February 4, 2025
MNCL: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

మంచిర్యాల రైల్వే స్టేషన్ ఓవర్ బ్రిడ్జి వద్ద మంగళవారం రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 25 ఏళ్లుంటుందన్నారు. నలుపు టీ షర్ట్, యాష్ రంగు ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. చేతిపై మామ అని టాటూ ఉందని జీఆర్పీ SI మహేందర్, హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు 8712658596, 9849058691 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News November 7, 2025
శుక్రవారం ఈ పని చేయకూడదా..?

శుక్రవారం రోజున దేవతా విగ్రహాలు, పటాలు, పూజా సామాగ్రిని శుభ్రం చేయడం అస్సలు మంచిది కాదని పండితులు చెబుతారు. ‘శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున ఇలాంటి కార్యాలు చేపడితే ఆ దేవత ఆగ్రహించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ఈ పనులు కారణమవుతాయి. అందుకే శుక్రవారం రోజున ఇలా చేయకూడదు. దేవుడి విగ్రహాలు, పటాల శుభ్రతకు బుధ, గురు, ఆది, సోమవారాలు అనుకూలం’ అని అంటారు.
News November 7, 2025
నేడు స్పీకర్ విచారణకు జగదీశ్ రెడ్డి, సంజయ్

TG: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మలిదశ విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ స్పీకర్ ప్రసాద్ సమక్షంలో పోచారం శ్రీనివాసరెడ్డి తరఫు న్యాయవాదులు జగదీశ్ రెడ్డిని, అరెకపూడి గాంధీ తరఫు లాయర్లు కల్వకుంట్ల సంజయ్‌ను ప్రశ్నించనున్నారు. నిన్న స్పీకర్ సమక్షంలో జగిత్యాల MLA సంజయ్‌పై ఫిర్యాదు చేసిన జగదీశ్ రెడ్డిని, వెంకట్రావ్‌పై ఫిర్యాదు చేసిన వివేకానందను ఆధారాలకు సంబంధించి లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు.
News November 7, 2025
విజయవాడ: బంగారం ఆశ చూపి.. రూ.8 లక్షలు స్వాహా!

తెలంగాణలోని చౌటుప్పల్‌కు చెందిన హోటల్ యజమాని బ్రహ్మయ్యను మోసం చేసి రూ.8 లక్షలు కాజేశారు ఇద్దరు కేటుగాళ్లు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మబలికి వంశీ, ప్రసాద్ అనే వ్యక్తులు విజయవాడకు రప్పించి, నగదు తీసుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు భవానిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


