News March 1, 2025
MNCL: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సమీపంలో రైలు కింద పడి శుక్రవారం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన నస్పూరి వినయ్‌గా గుర్తించారు. మృతుడు ప్రైవేట్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండగా.. భార్యా భర్తల మధ్య గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 1, 2025
అన్నమయ్య జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

అన్నమయ్య జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాల్లో.. 14,862 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లను అధికారులు నియమించారు.
☞ విద్యార్థులకు ALL THE BEST
News March 1, 2025
‘కృష్ణా’లో ఇంటర్ పరీక్షలకు 45,430 మంది

జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 63 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 45,430 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 43,795 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1635 మంది ఉన్నారు. ఫస్టియర్‌కు సంబంధించి జనరల్ విద్యార్థులు 23,630, ఒకేషనల్ విద్యార్థులు 927 మంది, సెకండియర్‌కు సంబంధించి జనరల్ విద్యార్థులు 20,175, ఒకేషనల్ విద్యార్థులు 708 మంది ఉన్నారు.
News March 1, 2025
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయం చరిత్ర ఇదే..!

అనకాపల్లి పట్టణం గవరపాలెం కొబ్బరి తోట ప్రాంతంలో 1450లో ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. 1611లో అనకాపల్లి ప్రాంతానికి రాజుగా నియమించబడిన అప్పలరాజు పాయకరావు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 1937లో దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్‌లో దేవాలయానికి ఈఓగా వ్యవహరిస్తారు. ప్రతి ఏటా ఉగాది ముందు రోజు నుంచి నెలరోజుల పాటు జాతర జరుగుతుంది.