News April 19, 2024
MNCL: రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

మంచిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మృతురాలు డార్క్ బ్రౌన్ రంగు పూల చీర, బ్రౌన్ కలర్ డాట్స్ బ్లౌజ్, ఆకుపచ్చ పసుపు పచ్చ గాజులు ధరించి ఉంది. జీఆర్పీ ఎస్ఐ సుధాకర్ ఉత్తర్వు మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 8712658596, 8328512176 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Similar News
News March 2, 2026
మార్చి 10న మెగా జాబ్ మేళా.. పోస్టర్ ఆవిష్కరణ

ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా సందర్భంగా వన్ టౌన్ సీఐ బి.సునీల్ కుమార్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 10న ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జరగనున్న ఈ జాబ్ మేళాలో 50కిపైగా కంపెనీలు పాల్గొని 2000కుపైగా ఉద్యోగాలు కల్పించనున్నాయి. నిరుద్యోగ యువతీయువకులు గూగుల్ ఫారమ్ QR Code లింక్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
News February 28, 2026
ADB జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్: SP

మార్చి ఒకటి నుంచి 31 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. డీఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News February 28, 2026
ADB: బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కామారెడ్డి MLA రమణా రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీకి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధం కావాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాయల్ శంకర్, MLC అంజి రెడ్డి, MLAలు హరీష్ బాబు, రామారావు పాటిల్ పాల్గొన్నారు.


