News March 8, 2025
MNCL: రోడ్డు ప్రమాదంలో మహిళ కూలీ దుర్మరణం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన చిట్యాల నర్సమ్మ అనే మహిళ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూలీ పని చేసే నర్సమ్మ ఉదయం ఇంటి నుంచి బయలుదేరి హైవే మీదుగా వెళుతుండగా అమరవాది ప్లైఓవర్ బ్రిడ్జి డివైడర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
Similar News
News March 2, 2026
అనకాపల్లి: ‘అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి’

జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీడీవోలు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. వచ్చే సమీక్ష సమావేశం నిర్వహించే సమయానికి ర్యాంకింగ్‌లో గణనీయమైన మార్పు రావాలన్నారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 2, 2026
NZB: హోలీ వేళ పోలీసుల ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

హోలీ పండుగ సందర్భంగా నిజామాకబాద్ జిల్లా ప్రజలు పోలీసు నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై లేదా వాహనాలపై బలవంతంగా రంగులు, నీటిని చల్లడం నిషేధమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే నిజామాబాద్ పోలీస్ చట్టం సెక్షన్ 76 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఆంక్షలు ఈనెల 2వ తేదీ సాయంత్రం 6 నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు.
News March 2, 2026
పెద్దపల్లి: కాపురానికి రాని భార్య.. భర్త ఆత్మహత్య!

కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. భార్య ఐదేళ్లుగా కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన కందునూరి రాజకుమార్ (35) సోమవారం తెల్లవారుజామున తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటరితనం కారణంగా మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


