News December 22, 2025

MNCL: లోక్ అదాలత్‌లో 4411 కేసులు పరిష్కారం

image

21న జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో రామగుండం కమిషనరేట్ పరిధిలో మొత్తం 4411 కేసులు పరిష్కరించామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. 59 సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు రూ.53,24,105 తిరిగి అందజేసినట్లు పేర్కొన్నారు. టార్గెట్‌కు మించి కేసులు పరిష్కరించబడడం పట్ల కమిషనరేట్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. త్వరలో కోర్టు సిబ్బందికి, మానిటర్ చేసిన అధికారులకు, త్వరలో రివార్డ్స్ అందజేస్తామన్నారు.

Similar News

News December 24, 2025

గద్వాల: కొనుగోలు కేంద్రంలో రైతు మృతి

image

గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని కలుకుంట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన రైతు జమ్మన్న(63) గుండెపోటుతో మృతి చెందారు. పంట విక్రయం కోసం నాలుగు రోజులుగా వేచి చూస్తున్న ఆయన, బుధవారం తూకం వేసే సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలారు. తోటి రైతులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ధాన్యం రాశుల వద్దే ప్రాణాలు వదలడం విషాదం నింపింది.

News December 24, 2025

పారా యూత్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్‌ను సత్కరించిన మంత్రి కొండపల్లి

image

దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్ -2025 పోటీల్లో బాడ్మింటన్‌లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్ చంద్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈసందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను తన క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాకారుడుని మంత్రి శాలువాతో సత్కరించి, అభినందించారు.

News December 24, 2025

లైఫ్ అంటే పని మాత్రమే కాదు బాస్! ఈ దేశాలను చూడండి..

image

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో కొన్ని దేశాలు మెరుగ్గా ఉన్నాయి. నెదర్లాండ్స్‌లో ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్‌తో ఫ్యామిలీకి టైమ్ దొరుకుతుంది. డెన్మార్క్ తక్కువ పని గంటలు, ఎక్కువ సెలవులతో టాప్‌లో ఉంది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో స్వీడన్, సండే రెస్ట్‌ ఇంపార్టెన్స్‌లో జర్మనీ, పనిదోపిడీని అరికట్టడంలో న్యూజిలాండ్ ముందు వరుసలో ఉన్నాయి. అందుకే ఆ దేశాల్లో ప్రొడక్టివిటీతో పాటు పర్సనల్ లైఫ్ మెరుగ్గా ఉంటుంది.