News January 24, 2025
MNCL: విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణానికి నష్టం

రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేయబోతున్న 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌తో మంచిర్యాల ప్రాంతంలో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని స్వచ్ఛంద పౌర సేవా సంస్థ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సింగరేణి ఓసీపీలు, వివిధ పరిశ్రమలతో గాలి కలుషితమైందని పేర్కొన్నారు. ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని పేర్కొన్నారు.
Similar News
News July 7, 2025
పుట్టపర్తిలో ఉ.9.30 నుంచి అర్జీల స్వీకరణ

పుట్టపర్తిలోని కలెక్టరేట్ కార్యాలయంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. అర్జీల స్థితిని తెలుసుకునేందుకు ప్రజలు 1100 నంబరుకు ఫోన్ చేయొచ్చని తెలిపారు. మరోవైపు పోలీసు కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు అర్జీలు స్వీరిస్తామని ఎస్పీ రత్న తెలిపారు.
News July 7, 2025
కాసేపట్లో వనమహోత్సవానికి సీఎం శ్రీకారం

TG: ‘వన మహోత్సవం’లో భాగంగా ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. వన మహోత్సవం కోసం 14,355 నర్సరీల్లో 20 కోట్ల మొక్కలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
News July 7, 2025
సిరిసిల్ల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్థుల వివరాలు ప్రకారం.. బరిగెల అరుణ్ కుమార్ (29), సిరిసిల్ల నెహ్రు నగర్‌కు చెందిన తడక సాయి చరణ్(27) లు <<16972767>>ఆదివారం<<>> ద్విచక్ర వాహనంపై సిరిసిల్లకు వెళ్తుండగా పెద్దూరు గ్రామ శివారులో వీరి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్ కుమార్ కు తీవ్ర గాయాలై మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.