News September 20, 2025
MNCL: విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అంగన్వాడీ టీచర్లపై చర్యలు

విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అంగన్వాడీ టీచర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం పోషణ మాసం కార్యక్రమంలో మాట్లాడుతూ.. సూపర్‌వైజర్లు తమ పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తించి సాధారణ స్థితికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 20, 2025
ములుగు: బోనస్ కోసం రైతుల ఎదురు చూపు?

ములుగు జిల్లాలో వరి ధాన్యం బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి నాలుగు నెలలు కావస్తున్నా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వట్లేదని అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. బోనస్‌కు ఆశపడి సన్నధాన్యం పండించామని అంటున్నారు. దసరాకు అయినా బోనస్ అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో సుమారు 11,379 మంది రైతులకు రూ.30 కోట్లకు పైగా బోనస్ చెల్లించాల్సి ఉంది.
News September 20, 2025
సెప్టెంబర్ 20: చరిత్రలో ఈ రోజు

✒ 1924: నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు(ఫొటోలో) జననం
✒ 1933: హోంరూల్ ఉద్యమ నేత అనీ బిసెంట్ మరణం
✒ 1948: బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ పుట్టినరోజు
✒ 1954: ప్రముఖ కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం జననం
✒ 1999: తమిళ నటి టి.ఆర్.రాజకుమారి మరణం
✒ రైల్వే భద్రతా దళ(RPF) వ్యవస్థాపక దినోత్సవం
News September 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.