News April 25, 2025
MNCL: విలేకరుల ముసుగులో దందా.. ఇద్దరి అరెస్ట్

విలేకరుల ముసుగులో మత్తు పదార్థాల దందా చేస్తున్న నిందితులను జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. CI సమ్మయ్య కథనం ప్రకారం.. తాండూరు మండలం జాతీయ రహదారి వద్ద ప్రెస్‌స్టిక్కర్ అంటించిన టాటా ఇండికా కారును తనిఖీ చేశారు. కారులో 216 కిలోల బెల్లం, 30 కిలోల పటిక పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకొని రాజ్ కుమార్, సంజులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు చందు పరారీలోఉన్నాడు.
Similar News
News April 25, 2025
మెదక్: కొడుకుల చేతులు కోసి, తల్లి సూసైడ్

అత్తింటి వేధింపులు భరించలేక కొడుకులతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన అహ్మద్, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రేష్మాబేగం(30)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు. తట్టుకోలేక కుమారుల చేతులపై కత్తితో గాయాలు చేసి, ఆమె ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పిల్లలను అసుపత్రికి తరలించారు.
News April 25, 2025
టెర్రరిస్ట్-మిలిటెంట్.. ఏంటి తేడా?

విశ్లేషకుల ప్రకారం.. హింసతో సమాజంలో భయం కల్గించి వ్యవస్థ సమగ్రత, సార్వభౌమత్వం, ఆర్థికస్థితి తదితరాలు దెబ్బతీసేది ఉగ్రవాదం (టెర్రరిజం). దీనికి రాజకీయ, మత, ప్రాంత తదితర కారణాలుంటాయి. సామాజిక, రాజకీయ లక్ష్యాలతో హింసకు పాల్పడేవారు తీవ్రవాదులు (మిలిటెంట్స్). రెండూ హింస మార్గాలే, కానీ ఉద్దేశాలు వేరు. పహల్గాం దాడి ‘మిలిటెంట్ అటాక్’ అన్న <<16207620>>NYTపై<<>> USA ప్రభుత్వం ‘ఇది టెర్రరిస్ట్ అటాక్’ అని కౌంటరిచ్చింది.
News April 25, 2025
సంగారెడ్డి: మహిళ సూసైడ్.. కొడుకులను చంపాలనుకుంది!

అత్తింటి వేధింపులు భరించలేక కొడుకులతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన అహ్మద్, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రేష్మాబేగం(30)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు. తట్టుకోలేక కుమారుల చేతిపై కత్తితో గాయాలు చేసి, ఆమె ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పిల్లలను అసుపత్రికి తరలించారు.