News February 20, 2025

MNCL: వ్యాపారం ముసుగులో గంజాయి అమ్మకం

image

మంచిర్యాలలో CC కెమెరాల వ్యాపారం ముసుగులో సాగుతున్న గంజాయి వ్యాపార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. IBx రోడ్, SBIకాంప్లెక్స్ కింద సెల్లార్‌లో ప్రవీణ్ కుమార్‌కి చెందిన Yఇన్ఫో సొల్యూషన్స్‌లో పోలీసులు సోదాలు చేశారు. కాగా అక్కడ తరలించేందుకు సిద్ధంగా ఉన్న CC కెమెరాల కాటన్ బాక్సుల్లో సుమారుగా రూ.11,75,000 విలువగల 23.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని 22మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Similar News

News November 13, 2025

IRCTCలో 46 ఉద్యోగాలు

image

<>IRCTC <<>>సౌత్ సెంట్రల్ జోన్‌ పరిధిలో 46 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. BSc (హాస్పిటాలిటీ), BBA/MBA, BSc(హోటల్ మేనేజ్‌మెంట్& క్యాటరింగ్ సైన్స్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థులు గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ సికింద్రాబాద్‌లో ఈనెల 13, 14తేదీల్లో నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://irctc.com

News November 13, 2025

మెన్‌స్ట్రువల్ కప్‌తో ఎన్నో లాభాలు

image

ఒక మెన్​స్ట్రువల్ కప్ పదేళ్ల వరకూ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది 2,500 శ్యానిటరీ ప్యాడ్స్‌తో సమానం. అలాగే 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ కప్​ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్‌ స్కిప్పింగ్‌ అన్నీ చేసుకోవచ్చంటున్నారు. అలాగే ప్యాడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ మెన్‌స్ట్రువల్ కప్‌తో ఆ ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.

News November 13, 2025

కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

image

కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం.. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న చిన్న సుంకిరెడ్డికి ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల(M) భీమునిపాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.