News April 12, 2025
MNCL: ‘సంక్షేమ, అభివృద్ధి పనులను సమర్థంగా నిర్వహించాలి’

జిల్లాలోని గ్రామపంచాయతీల పరిధిలో సంక్షేమ, అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో పని చేసి సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం నస్పూర్‌లోని మంచిర్యాల కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో గ్రామపంచాయతీలో అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. 2025 పూర్తయ్యేలోగా క్షయ వ్యాధి రహిత గ్రామ పంచాయతీలుగా మార్చాలని ఆదేశించారు.
Similar News
News February 25, 2026
చెరకు పంటలో పీక, కాండం తొలుచు పురుగు ప్రభావం

చెరకు నాటిన దగ్గరి నుంచి నరికే వరకు ఈ పురుగులు పైరును ఆశిస్తాయి. బాల్య దశలో పీకపురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా పంటను నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధార చెరకుపై ఎక్కువగా ఉంటుంది. దీని ఉద్ధృతి ఎక్కువైతే పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పురుగుల విషయంలో నిర్లక్ష్యం వద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News February 25, 2026
పార్వతీ దేవి అన్నపూర్ణగా ఎలా మారింది?

లోకానికి ఆహారం అందించే దేవత అన్నపూర్ణ దేవి. ఓసారి శివుడు ‘ఆహారం ఓ భ్రమ’ అన్నాడు. దీంతో కోపగించిన పార్వతీదేవి కాశీకి వెళ్లింది. దీంతో సకల జీవరాశులు ఆకలితో అలమటించాయి. అప్పుడు ఆహారం ప్రాముఖ్యం అర్థమైన శివుడు కాశీకి వెళ్లి అమ్మవారిని భిక్ష అడుగుతాడు. పరమేశ్వరుడికే అన్నం పెట్టడంతో ఆ తల్లి ‘అన్నపూర్ణ’గా ప్రసిద్ధి చెందింది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
News February 25, 2026
607 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLCIL)లో 607 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి గడువు నేటితో ముగియనుంది. ఐటీఐ అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.11,040 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in


