News July 10, 2025
MNCL: సమగ్ర శిక్షా నూతన జెండర్ & డిప్యూటీ కోఆర్డినేటర్‌గా విజయలక్ష్మి

మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్షా నూతన జెండర్ & డిప్యూటీ కోఆర్డినేటర్‌గా విజయలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె దండేపల్లి మండలంలోని వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో బాలికలకు భద్రత, భరోసాతో కూడిన నాణ్యమైన విద్య అందించి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈఓ యాదయ్య సూచించారు.
Similar News
News July 10, 2025
టీబీ కేసుల గుర్తింపు కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం పీహెచ్‌సీని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ 100 రోజుల యాజిక్యంపై సమీక్షించారు. టీబీ కేసుల గుర్తింపు కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. డాక్టర్ ప్రణీత, ఫార్మాసిస్ట్ ప్రపుల్ల, ల్యాబ్ టెక్నీషియన్ మహేశ్ తదితరులున్నారు.
News July 10, 2025
భువనగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మోత్కూర్ జామచెట్లబావి ఎక్స్ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలిలా.. గుండాల మండలం వంగాలకి చెందిన చిప్పలపల్లి శంకర్ (48) టీవీఎస్‌పై మోత్కూర్ నుంచి ఇంటికి వెళుతున్నాడు. ఓ మైనర్ బాలుడు బైక్‌పై అతి వేగంగా వచ్చి శంకర్ వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
News July 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.