News February 28, 2025

MNCL: సింగరేణి సీఎండీ సాహసోపేత చర్య

image

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాద ఘటన స్థలం సమీపంలోకి శుక్రవారం సింగరేణి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రెస్క్యూ సభ్యుల్లో మనోధైర్యం నింపేలా సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ సాహసోపేత చర్యలు చేపట్టారు. రెస్క్యూ బృందంతో కలిసి సొరంగంలోకి లోకో రైలులో వెళ్ళారు. వారం రోజులుగా కేంద్ర, రాష్ట్ర బృందాలతో సహాయక చర్యల్లో సింగరేణి బృందం నిమగ్నం కాగా.. మరో 200 మంది సభ్యులు చేరుకున్నారు.

Similar News

News September 15, 2025

కాలేజీలు యథావిధిగా నడపండి: సీఎం రేవంత్

image

TG: కాలేజీల బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు సానుకూలంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని, కాలేజీలు యథావిధిగా నడిపించాలని యూనియన్ నాయకులను ఆయన కోరారు. కళాశాలల సమస్యలు, యాజమాన్యాలు చేస్తున్న డిమాండ్లపై సీఎంతో భట్టి, శ్రీధర్ బాబు భేటీ ముగిసింది. ఈ సాయంత్రం యూనియన్ నాయకులతో మంత్రులు చర్చించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

News September 15, 2025

వనపర్తి: మూడు వైద్య అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

వనపర్తి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మూడు వైద్య అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుతో పాటు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చొప్పున జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం, వనపర్తి పేరు మీద డీడీ తీసి జత చేయాలని ఆయన సూచించారు.

News September 15, 2025

అంతర పంటల సాగుతో ఆర్థికాభివృద్ధి: భద్రాద్రి కలెక్టర్

image

అంతర పంటల సాగుతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ములకలపల్లి మండలం ముకమామిడి గ్రామపంచాయతీ పరిధిలోని గట్టగూడెం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వెదురు సాగును కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి రైతు సాంప్రదాయ పంటలతో పాటు కొత్త పంటలను ప్రయత్నించాలన్నారు. అంతర పంటల సాగు ద్వారా తక్కువ భూమిలో ఎక్కువ లాభాలు పొందవచ్చునని అన్నారు.