News March 21, 2025
MNCL: స్కాలర్షిప్.. APPLY NOW

2025 సంవత్సరంలో ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం డిగ్రీ పూర్తయినా లేదా చివరి ఏడాది చదువుతున్న వారు మే 19లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు https://telanganaepass.cgg.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Similar News
News January 1, 2026
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ‘స్టార్ పెర్ఫార్మర్’ అవార్డులు

కలెక్టర్ సూచనల మేరకు PDPL ప్రభుత్వ ఆసుపత్రిలో జనవరి నెలకు ‘స్టార్ పెర్ఫార్మర్’ అవార్డులు ప్రదానం చేశారు. SNCU స్టాఫ్ నర్స్ శ్రీమతి ప్రశాంతి, క్యాజువాలిటీ స్టాఫ్ నర్స్ శ్రీమతి కళ్యాణిలను ఎంపిక చేశారు. SNCUలో మెరుగైన సేవలు, శిక్షణ అందించినందుకు ప్రశాంతిని, తోడులేని రోగులకు అంకిత సేవలందించినందుకు కళ్యాణిని సత్కరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.శ్రీధర్, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
News January 1, 2026
మంథనిలో టీటీడీ ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన

మంథనిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణ ప్రతిపాదనల కోసం అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం మంథని శివారులోని లక్కేపూర్ శివాని గూడెం గుట్ట ప్రాంతాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలన చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయం, కళ్యాణ మండపం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఆర్‌డీఓ, తహశీల్దార్, అధికారులు పాల్గొన్నారు.
News January 1, 2026
ఈ ఏడాది పండుగల తేదీలివే..!

ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు జనవరి 13 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నాయి. ఫిబ్రవరి 15న శివరాత్రి, మార్చి 4న హోలీ, 19న ఉగాదితో పాటు 19/20న రంజాన్ పండుగ ఉండనుంది. మార్చి 27న శ్రీరామనవమి, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి రానున్నాయి. ఆగస్టు 28న రాఖీ, సెప్టెంబర్ 14న వినాయక చవితి, అక్టోబర్ 20న దసరా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 8న దీపావళి, 24న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25న క్రిస్మస్‌తో ఏడాది ముగియనుంది. share it


