News June 12, 2024

MNCL: స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశానికి ఎంపిక పోటీలు

image

రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్‌లోని స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశానికి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కీర్తి రాజవీరు తెలిపారు. ఈ నెల 21 నుంచి 25 వరకు మండల స్థాయి, 28న జిల్లా స్థాయి, జూలై 7, 8 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయన్నారు. 4వ తరగతి చదువుతున్న 20 మంది బాలురు, 20 మంది బాలికలు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

Similar News

News July 5, 2025

ADB: బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై కేసు నమోదు

image

బాలలను పనిలో పెట్టుకున్న ముగ్గురిపై శుక్రవారం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ మదీనా హోటల్‌లో బాల కార్మికుడితో పని చేయించుకుంటున్న యజమాని అబ్దుల్ హసీబ్‌పై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. అదేవిధంగా మాంసం దుకాణ యజమాని ప్రవీణ్, మదీనా బెడ్ వర్క్ యజమాని షేక్ ఫరీద్‌పై కార్మిక శాఖ అధికారి శంకర్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు 1 టౌన్ సీఐ సునీల్ చెప్పారు.

News July 5, 2025

రెసిడెన్షియల్ విద్యాలయాలను తనిఖీ చేసిన ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం రాత్రి వివిధ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్యా, మౌలిక సదుపాయాలు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రత, అభ్యాసం, మౌలిక వసతుల మెరుగుదల కోసం అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

News May 7, 2025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ADB SP

image

ప్రస్తుత ఆధునిక సమాజంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా cybercrime.gov.in వెబ్సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వారం రోజులలో జిల్లాలో 13 ఫిర్యాదులు నమోదయినట్లు తెలిపారు. ఆన్‌లైన్ మనీ, గేమింగ్, బెట్టింగ్ చేయడం చట్ట విరుద్ధమన్నారు.