News January 31, 2025
MNCL: 10వ తరగతి పరీక్షలలో జిల్లా మెరవాలి: కలెక్టర్

10వ తరగతి వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను ఉన్నతస్థానంలో నిలపాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రేరణ అవగాహన తరగతుల్లో ఆయన మాట్లాడారు. పరీక్షలకు 50రోజుల సమయమే ఉన్నందున ఏకాగ్రతతో చదవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సాధించేలా పట్టుదలతో కృషి చేయాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
Similar News
News December 6, 2025
విజయవాడ: పనులు ఆలస్యం.. గడువు దాటినా మార్పు లేదు

గన్నవరం విమానాశ్రయంలో రూ. 170 కోట్లతో 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన నూతన టెర్మినల్ భవనం 30 నెలల్లో పూర్తికావాల్సి ఉండగా 68 నెలలు గడిచినా పనులు ముందుకుసాగడం లేదు. కేంద్ర మంత్రి 2 సార్లు పరిశీలించి హెచ్చరికలు చేసినా మార్పు లేక డిసెంబర్ గడువు కూడా దాటిపోయింది. ఇంకా కనీసం 6 నెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. టెర్మినల్ ఆలస్యంతో బోయింగ్ సేవలు ప్రారంభం కావడం లేదు.
News December 6, 2025
గుంటూరు మీదుగా శిరిడీకి కొత్త వీక్లీ స్పెషల్ రైలు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. తిరుపతి-సాయినగర్ శిరిడీ మధ్య కొత్త వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఇది మంగళవారం తిరుపతిలో బయలుదేరి, బుధవారం శిరిడీ చేరుకుని, తిరుగు ప్రయాణం అవుతుంది.
News December 6, 2025
కేంద్ర మంత్రి రామ్మోహన్‌పై విమర్శలు.. తిప్పికొట్టిన ఎంపీలు

ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తోటి MPలు మద్దతుగా నిలిచారు. ‘రామ్మోహన్ UDAN పథకాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల కొత్త ఎయిర్‌లైన్స్‌కు అవకాశాలు వస్తాయి. ఈ రంగంలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించారు. సంక్షోభాల్లో విమానయాన సంస్థలను జవాబుదారీగా చేశారు. ప్రయాణికులకు అండగా నిలబడ్డారు’ అని పెమ్మసాని, లావు ట్వీట్లు చేశారు.


