News December 22, 2024

MNCL: 11 నుంచి 27 వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు

image

మంచిర్యాల జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు జనవరి 11 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 11 నుంచి 17 వరకు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హైయ్యర్ గ్రేడ్ పరీక్ష, 11వ తేదీన టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 12, 16వ తేదీన హైయర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 25, 2026

FLASH: ఇంద్రవెళ్లిలో యాక్సిడెంట్

image

ఇంద్రవెళ్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై నుంచి పడి గాయాల పాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని అంజి రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి వ్యక్తి కింద పడిపోగా గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు అపస్మారక స్థితిలో ఉండడంతో ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది.

News February 25, 2026

ADB: మార్చి 28కి జాతీయ లోక్ అదాలత్ వాయిదా

image

ఆదిలాబాద్ జిల్లాలో మార్చి 14న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ అదే నెల 28వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు వెల్లడించారు. అదనంగా లభించిన ఈ రెండు వారాల సమయాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పరస్పర అంగీకారంతో రాజీ పడటం ద్వారా దీర్ఘకాలిక కేసుల నుంచి విముక్తి పొందవచ్చని, మార్చి 28న జరిగే అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.

News February 25, 2026

ఆదిలాబాద్: మార్చి 14 నుంచి SSC పరీక్షలు

image

పదో తరగతి పరీక్షలను మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు 52 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. 10,928 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని, పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడలన్నారు.