News April 11, 2025
MNCL: 14న సింగరేణిలో వేతనంతో కూడిన సెలవు

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14న సింగరేణి ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సెలవు రోజున అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు సాధారణ వేతనంతో కలిపి మూడు రేట్లు వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News October 23, 2025
ANU: నానో టెక్నాలజీ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన I, V ఇయర్స్ నానో టెక్నాలజీ సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఫలితాల రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 3వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.1860లు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
News October 23, 2025
మ్యూజిక్ డైరెక్టర్ సబేశన్ కన్నుమూత

తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ MC సబేశన్(68) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో మరణించారు. లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ దేవా సోదరుడే సబేశన్. తన మరో సోదరుడు మురళీతో కలిసి దేవా వద్ద అసిస్టెంట్గా పనిచేశారు. తర్వాత సబేశన్-మురళి జోడీ పాపులరైంది. పొక్కిషమ్, కూడల్ నగర్, మిలగ, గొరిపలయమ్, 23వ పులకేశి, అదైకాలమ్, పరాయ్ మొదలైన చిత్రాలకు సంగీతం అందించింది. రేపు చెన్నైలో సబేశన్ అంత్యక్రియలు జరుగుతాయి.
News October 23, 2025
పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. గురువారం కమిషనరేట్లో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో సీపీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వారి సమస్యలను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్ధలం సంబంధించి సమస్యలపై విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీపీ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.