News March 11, 2025
MNCL: 14న సెలవు

సింగరేణిలో ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. హోలీ పండుగ సెలవు రోజున అత్యవసర విధులు నిర్వహించే ఉద్యోగులకు సాధారణ వేతనంతో పాటు మూడు మస్టర్ల కింద వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సంస్థ ఉన్నతాధికారులు, అన్ని ఏరియాల జీఎంలకు ఉత్తర్వులు ఇచ్చారు.
Similar News
News March 22, 2025
ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకల్లో తారలు వీరే

ఈరోజు సాయంత్రం ఆరింటికి IPL ఓపెనింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. వీటిలో బాలీవుడ్ తారల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. నటీనటులు దిశా పటానీ, శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ డాన్సులు, శ్రేయా ఘోషల్, అర్జీత్ సింగ్ పాటలు, పంజాబీ ఆర్టిస్ట్ కరణ్ ఔజ్లా ర్యాప్ ఆరంభోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇక 7.30 గంటలకు KKR, RCB మధ్య మ్యాచ్ మొదలుకానుంది.
News March 22, 2025
NRPT: జలం ఒడిసిపట్టు.. కరవును తరిమికొట్టు..!

నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ నీటి దినోత్సవ సందర్భంగా వినూత్నంగా జల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జలవనులను ఒడిసిపట్టు.. కరవును తరిమికొట్టు.. అంటూ చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలి? నీటిని వృథా చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. టీచర్స్ పాల్గొన్నారు.
News March 22, 2025
రేపు, ఎల్లుండి వర్షాలు

TG: నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, కర్ణాటక వరకు కొనసాగిన ద్రోణి ఇవాళ బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, పిడుగులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈరోజు రాత్రి వరకు కొన్ని చోట్ల వాన పడుతుందని పేర్కొంది.