News April 11, 2025
MNCL: 14న సింగరేణిలో వేతనంతో కూడిన సెలవు

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 14న సింగరేణి ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ఈ మేరకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సెలవు రోజున అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు సాధారణ వేతనంతో కలిపి మూడు రేట్లు వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News September 14, 2025
పెదవాగు రిజర్వాయర్‌కి వరద ఉద్ధృతి.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పెదవాగు రిజర్వాయర్‌కి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్‌లో 1800-233-1077, 94910 41419, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఆఫీస్‌లో 83092 69056, వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయంలో 8328696546 మూడు చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి శనివారం తెలిపారు. అత్యవసర సమయంలో ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.
News September 14, 2025
నూజివీడులో విద్యుత్ ఘాతంతో లారీ డ్రైవర్ మృతి

నూజివీడు మండలం రావిచర్ల గ్రామం నుంచి మామిడి పుల్ల లోడుతో వస్తున్న లారీ విద్యుత్ ఘాతానికి గురికావడంతో డ్రైవర్ రవి అక్కడికక్కడే చనిపోయాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన రవి శనివారం రాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.
News September 13, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: యూరియా దొరకక రైతుల ఇక్కట్లు
> గానుగుపహాడ్ బ్రిడ్జి నిర్మించాలని వాహనదారులు, స్థానికుల ధర్నా
> దిక్సూచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
> దేవరుప్పుల: షేక్ బందగి స్తూపం వద్ద నివాళులు అర్పించిన సీపీఎం నేతలు
> డాక్టరేట్ పొందిన మచ్చుపహాడ్ వాసి
> స్టేషన్ ఘనపూర్: బెట్టింగ్ కోసం దొంగతనాలు.. ఒకరి అరెస్ట్
> చిన్న పెండ్యాల: రైలు కిందపడి బర్రెలు మృతి