News November 13, 2025
MNCL: 17న మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

మంచిర్యాల శ్రీశ్రీ నగర్‌లోని ఆనంద నిలయంలో ఈ నెల 17న మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి భాస్కర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాల మహిళలకు ఈ కేంద్రంలో ఉచితంగా కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 13, 2025
లాక్టోజ్ ఇన్టాలరెన్స్ గురించి తెలుసా?

లాక్టోజ్ ఇన్టాలరెన్స్ ఉన్నవారిలో పాలపదార్థాల్లో ఉండే లాక్టోజ్‌ను విడగొట్టే లాక్టేజ్ ఎంజైమ్ తగినంత ఉత్పత్తి కాదు. దీంతో కడుపునొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ, వాంతులు, విరేచనాలు వస్తాయి. వీరు రాగులను నానబెట్టి రుబ్బి తీసిన పాలు, రాగిజావ, రాగి మాల్ట్, ఓట్ మిల్క్, సోయా పాలు వంటివి తీసుకోవచ్చంటున్నారు. అలాగే ఆకుకూరలు, చేపలు, బోన్ సూప్ ఆహారంలో చేర్చుకున్నా శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది.
News November 13, 2025
కరీంనగర్ ‘టాస్క్’లో రేపు జాబ్ డ్రైవ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్, మొదటి అంతస్తులో గల ‘టాస్క్’ కార్యాలయంలో నవంబర్ 14న(రేపు) జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం ఈ డ్రైవ్ చేపడుతున్నారు. 2024-25లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 9 గంటలకు ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలని వారు సూచించారు.
News November 13, 2025
కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 పోస్టులు

కేంద్రీయ విద్యాలయం, నవోదయలో 12,799 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో కేంద్రీయ విద్యాలయంలో 9,156( 7,444 టీచింగ్, 1,712 నాన్ టీచింగ్ పోస్టులు), నవోదయలో 3,643 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, B.Ed, D.Ed, పీజీ, సీటెట్, ఇంటర్, డిప్లొమా, B.LSc అర్హతగల అభ్యర్థులు రేపటి నుంచి డిసెంబర్ 4వరకు అప్లై చేసుకోవచ్చు.


