News April 21, 2025

MNCL: 184 మంది పరీక్ష రాయలేదు: DEO

image

మంచిర్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మొదటి రోజైన ఆదివారం సజావుగా జరిగినట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. పదో తరగతి పరీక్షకు మొత్తం 494కి 431 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 63 మంది పరీక్ష రాయలేదని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షకు మొత్తం 935కి 814 మంది హాజరు కాగా 121 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

Similar News

News April 21, 2025

వనపర్తి: నాలుగు కేంద్రాల్లో స్వల్ప వర్షపాతం నమోదు

image

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో (నిన్న ఉదయం 8:30 నుంచి ఈరోజు 8:30 వరకు) నాలుగు కేంద్రాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. చిన్నంబావిలో 9.0 మిల్లీమీటర్లు, రేవల్లిలో 6.2 మిల్లీమీటర్లు, కొత్తకోటలో 3.4 మిల్లీమీటర్లు, గోపాల్‌పేటలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. మిగిలిన 10 కేంద్రాల్లో జీరో వర్షపాతం నమోదైంది.

News April 21, 2025

MHBD: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ మహబూబాబాద్ జిల్లా అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు TGMREIS వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చన్నారు.

News April 21, 2025

వనపర్తి: మేడే ఉత్సవాలకు సిద్ధం కావాలి: విజయ రాములు

image

వనపర్తి జిల్లాలో మే 1న అంతర్జాతీయ కార్మిక దినం మే డేకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు ఒక ప్రకటనలో కోరారు. గ్రామాల్లో పార్టీ జెండాలు దిమ్మెలకు రంగులు వేసి ముస్తాబు చేయాలన్నారు. గ్రామ, మండల శాఖ సమావేశాలను పూర్తి చేయాలని, సమావేశాల్లో గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించాలని పేర్కొన్నారు.

error: Content is protected !!