News March 18, 2025
MNCL: 21, 22వ తేదీల్లో ఇంటర్వ్యూలు

మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాజువాలిటీ మెడికల్ అధికారి పోస్టులను ఒప్పంద పద్ధతిన భర్తీ చేసేందుకు ఈ నెల 21, 22వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి సులేమాన్ తెలిపారు. ఐదు క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులలో సీఎంవో, ఆర్ఎంవో పోస్టులకు ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారికి ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్‌వెస్టిగేషన్ యూనిట్‌కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్‌షీట్‌ల దాఖలుకు అనుమతినిచ్చింది.
News September 16, 2025
మంజీరా నది ఉరకలేస్తుంది..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. దీంతో ప్రాజెక్టులోని తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉద్ధృతి కారణంగా పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద మంజీర నది ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 62,542 క్యూసెక్కులుగా ఉంది.
News September 16, 2025
కామారెడ్డిలో ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’

కామారెడ్డి జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 15 రోజులు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.