News April 3, 2025
MNCL: 28 మంది పరీక్ష రాయలే: DEO

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. జిల్లాలోని 49 పరీక్షా కేంద్రాల్లో బుధవారం జరిగిన సాంఘీక శాస్త్రం పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 9198 మందికి 9175, గతంలో ఫెయిలైన 11 మంది విద్యార్థులకు ఆరుగురు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 9209 మంది విద్యార్థులకు 9181 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించారు.
Similar News
News December 21, 2025
జగిత్యాల జిల్లాలో ప్రజావాణి వాయిదా: కలెక్టర్

సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో, అదే రోజు జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తెలిపారు. ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమం తదుపరి తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.
News December 21, 2025
VJA: ‘కథ మళ్లీ మొదలైంది’ గ్రంథావిష్కరణ

విజయవాడలోని కే-హోటల్‌లో ‘కథ మళ్లీ మొదలైంది’ పుస్తకావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. శ్రీ కంఠస్ఫూర్తి సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాహిత్యంపై ఆయన ఆసక్తికర ప్రసంగం చేశారు. పలువురు ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో పుస్తక రచయితను, నిర్వాహకులను అభినందించారు.
News December 21, 2025
KNR: చెక్ డ్యామ్‌ల పేల్చివేతపై కేసీఆర్ ఫైర్

ఉమ్మడి KNR జిల్లాలోని చెక్ డ్యామ్‌ల పేల్చివేత ఘటనలపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత BRS ప్రభుత్వ హయాంలో రైతుల ప్రయోజనం కోసం నిర్మించిన ఈ కట్టడాలను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని ఆయన మండిపడ్డారు. తమ అధికారంలోకి వచ్చాక చెక్ డ్యామ్‌లను పేల్చిన వారు పాతాళంలో ఉన్న పట్టుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే సంస్కృతి రాష్ట్రానికి ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.


