News January 1, 2025

MNCL: 3న ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ విచారణ

image

SC వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ప్రతినిధి, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ జనవరి 3న బహిరంగ విచారణ చేపడతారని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజల అభిప్రాయాలను బహిరంగ విచారణలో స్వీకరిస్తారని పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

image

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.

News November 22, 2025

నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

image

నార్నూర్‌లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్‌లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.