News January 1, 2025

MNCL: 3న ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ విచారణ

image

SC వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ప్రతినిధి, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ జనవరి 3న బహిరంగ విచారణ చేపడతారని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజల అభిప్రాయాలను బహిరంగ విచారణలో స్వీకరిస్తారని పేర్కొన్నారు.

Similar News

News January 4, 2025

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు : MNCL CP

image

మంచిర్యాల జోన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకూడదని CPశ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1 వరకు నిషేధాజ్ఞాలను కొనసాగిస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ఆగడాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News January 3, 2025

సావిత్రిబాయిఫూలేని ఆదర్శంగా తీసుకోవాలి: ASF కలెక్టర్

image

మొదటి ఉపాధ్యాయురాలిగా పనిచేసిన సావిత్రిబాయి ఫూలేను మహిళా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సావిత్రిబాయి జయంతి సందర్భంగా నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి రమాదేవి, విద్యాశాఖ అధికారులతో కలిసి హాజరై సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

News January 3, 2025

MNCL: ‘బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం’

image

బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదామని CP శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ పరిధి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో గురువారం CP సమీక్ష నిర్వహించారు. CP మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31వ వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్-Xlను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని అధికారులను కోరారు. ప్రతి ఒక్క అధికారి ముగ్గురు పిల్లలను కాపాడాలని సూచించారు.