News February 18, 2025
MNCL: 30వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్షలు

మంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంట్ ఎదుట కార్మికులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు నేటితో 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ.. ప్లాంట్ మూసివేసి 26 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా కంపెనీ యాజమాని, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
Similar News
News March 28, 2025
విజయనగరంలో బాలికపై బాలుడు అత్యాచారయత్నం

విజయనగరం రూరల్ పరిధిలో బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈనెల 26న ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేశామన్నారు. ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో బాలుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో బాలుడు పరారయ్యాడన్నారు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.
News March 28, 2025
హీరోను అంటూ నమ్మించి దారుణం.. కేసు నమోదు

హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు(D) చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట(M)నికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి లాడ్జిలో శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.
News March 28, 2025
బెల్లంపల్లి: భార్యకు వేరే పెళ్లి.. భర్త ఆత్మహత్య

బెల్లంపల్లి హనుమాన్ బస్తీకి చెందిన మంతెన శివకుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 1-టౌన్ సీఐ దేవయ్య వివరాలు.. శివకుమార్‌కు 8 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది. HYDలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో యాక్సిడెంట్ కాగా కాలు విరిగింది. దీంతో అతని వదిలి భార్య వేరే పెళ్లి చేసుకుంది. దీంతో జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.