News February 18, 2025
MNCL: 30వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్షలు

మంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంట్ ఎదుట కార్మికులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు నేటితో 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ.. ప్లాంట్ మూసివేసి 26 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా కంపెనీ యాజమాని, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
Similar News
News December 16, 2025
SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

* యోనో 1.0లో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారంగా 2.0 వెర్షన్‌ను SBI లాంచ్ చేసింది.
* UPI చెల్లింపులను సులభంగా చేయొచ్చు. డొమెస్టిక్/ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఆటోపే ఆప్షన్స్ ఉంటాయి.
* క్రెడిట్ స్కోర్ సిమ్యులేటర్ ఉంది. iOS యూజర్లకు ఫేస్ ఐడీ, ఆండ్రాయిడ్ కస్టమర్లకు బయోమెట్రిక్ సహా మల్టిపుల్ లాగిన్ ఆప్షన్లు ఉన్నాయి.
* ఈ యాప్‌ను మొబైల్‌తోపాటు టాబ్లెట్, డెస్క్‌టాప్స్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు.
News December 16, 2025
ఉమ్మడి కరీంనగర్.. 19 మండలాల్లో ఉత్కంఠ..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో 388 GPలు, 1,580 వార్డులకు 3వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. KNR(D)లో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్, పెద్దపల్లి(D)లో పెద్దపల్లి, ధర్మారం, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు మండలాల్లో జరగనున్నాయి. జగిత్యాల(D)లో బుగ్గారం, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూరు, సిరిసిల్ల(D)లో ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లిలో ఎలక్షన్స్.
News December 16, 2025
స్టీల్ ప్లాంట్ హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు

విశాఖ స్టీల్ ప్లాంటు హాట్ మెటల్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. 3బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా రోజుకు19వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఉండగా..24 గంటల్లో 21,012 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి జరిగింది. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు బ్లాస్ట్ ఫర్నేస్–1 నుంచి 7,058 టన్నులు, ఫర్నేస్–2 నుంచి 6,558 టన్నులు, ఫర్నేస్–3 నుంచి 7,396 టన్నులు ఉత్పత్తిచేసి గత రికార్డును అధిగమించారు.


