News July 7, 2025
MNCL: 45 లక్షల మొక్కలు నాటేందుకు సింగరేణి సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంస్థ సీఅండ్ఎండీ బలరాం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపొందించేందుకు ఖాళీ ప్రదేశాల్లో కనీసం మూడు మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. సింగరేణి సంస్థ ఇప్పటికే 14 వేల హెక్టార్లలో ఏడు కోట్లకు పైగా మొక్కలను నాటిందని పేర్కొన్నారు.
Similar News
News July 7, 2025
అనకాపల్లి వైపు నుంచి విశాఖ వెళ్తున్నారా?

గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈనెల 9 ఉ.6 గంటల నుంచి 10వ తేదీ సా.5 గంటల వరకు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే RTC, ప్రైవేట్ బస్సులు లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వచ్చే వాహనాలు ఆనందపురం, సబ్బవరం, పెందుర్తి మీదుగా అనకాపల్లి చేరుకోవాలని సూచించారు.
News July 7, 2025
కోహెడ: అతివేగంతో యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో <<16971399>>ఇద్దరు <<>>యువకులు మృతిచెందిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన శ్రీకాంత్(22), రిషి(15) రాత్రి బైక్‌పై కోహెడ వెళ్తున్నారు. అతివేగంతో కొత్తూరు సత్తయ్య ఇంటి గోడను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు ఉండటంతో మత్తులో ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
News July 7, 2025
విశాఖ చేరుకున్న మంత్రి పార్థసారధి

ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన నిమ్మితం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సోమవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సమాచార శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి మంత్రి రోడ్డు మార్గాన్న బయలుదేరి నగరంలోకి వెళ్లారు.