News February 19, 2025
MNCL: 5మండలాల ప్రజలకు శుభవార్త

అభయారణ్యంలోని అటవీ చెక్ పోస్టుల ద్వారా 5 మండలాల ప్రజల వాహనాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని జన్నారం మండలంలోని ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జన్నారం, కడెం, దస్తురాబాద్, దండేపల్లి, ఉట్నూర్ మండలాల వాహనాలకు చెక్ పోస్టుల ద్వారా అనుమతి ఉందన్నారు. ఆ వాహనాల యజమానులు సెస్ చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని వాహనదారులు గమనించి ధ్రువీకరణ పత్రాలు చూపించి సహకరించాలన్నారు.
Similar News
News February 26, 2026
నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఫణీంద్ర రెడ్డి

నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా జి. ఫణీంద్ర రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్త ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGMSIDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించిన ఆయనను నారాయణపేటకు బదిలీ చేశారు. త్వరలోనే ఆయన జిల్లా కేంద్రంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
News February 26, 2026
పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్(రాజస్థాన్)లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉదయం 10:10 గంటలకు విజయ్.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ సందర్భంగా అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ‘VIJAY DEVARAKONDA’ హ్యాష్‌ట్యాగ్ Xలో ట్రెండ్ అవుతోంది. సాయంత్రం మరోసారి ‘<<19227454>>కొడువ<<>>’ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.
News February 26, 2026
తెనాలిలో రేపు ఆయేషా మీరా అంత్యక్రియలు

ఆయేషా మీరా అస్థికలను సీబీఐ ఆమె తల్లిదండ్రులకు అప్పగించనుంది. రేపు తెనాలిలో భారీ బందోబస్తు నడుమ ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థలన్నీ విఫలమయ్యాయని ఆయేషా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, డిసెంబర్ 27ను ఆయేషా సంస్మరణ దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.


