News February 19, 2025
MNCL: 5మండలాల ప్రజలకు శుభవార్త

అభయారణ్యంలోని అటవీ చెక్ పోస్టుల ద్వారా 5 మండలాల ప్రజల వాహనాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని జన్నారం మండలంలోని ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జన్నారం, కడెం, దస్తురాబాద్, దండేపల్లి, ఉట్నూర్ మండలాల వాహనాలకు చెక్ పోస్టుల ద్వారా అనుమతి ఉందన్నారు. ఆ వాహనాల యజమానులు సెస్ చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని వాహనదారులు గమనించి ధ్రువీకరణ పత్రాలు చూపించి సహకరించాలన్నారు.
Similar News
News March 1, 2026
చిత్తూరు: రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

జిల్లా వ్యాప్తంగా ఈనెల 2 నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలకు జిల్లాలో 13 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,528 మంది హాజరుకానున్నట్లు చెప్పారు. మార్చి 13 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు.
News March 1, 2026
గుత్తి: వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ ప్రారంభం

రైల్వే ఇన్స్టిట్యూట్లో అందరికీ ఉపయోగపడే విధంగా వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్‌ను ప్రారంభించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ కం ఏడీఎంఈ అశోక్ గౌడ్, సెక్రెటరీ నయాబ్ రసూల్ చాట్ బాట్ సర్వీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైల్వే ఇన్స్టిట్యూట్‌ను రిజర్వ్ చేసుకోవడానికి, రూమ్స్‌ను బుక్ చేసుకోవడానికి 9652793707 వాట్సాప్ నంబర్ ద్వారా చేసుకొనే అవకాశాన్ని కల్పించామన్నారు.
News March 1, 2026
ఖమేనీ కుటుంబంలో నలుగురు మృతి!

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబంలోని నలుగురు చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆయన కూతురు, అల్లుడు, కోడలు, మనవడు చనిపోయినట్లు పేర్కొంది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో ఖమేనీ ఇంటిపై 30 బాంబులు వదిలినట్లు తెలిపింది. ఇందుకోసం ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తోందని, అగ్రనాయకులు అందరూ ఒకే దగ్గర ఉండగా అటాక్ చేసిందని వెల్లడించింది.


