News March 20, 2025

MNCL: ‘9,419 మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు’

image

జిల్లాలో ఈ నెల 21 నుంచి జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈఓ ఎస్.యాదయ్య తెలిపారు. 49 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 9,198 మంది రెగ్యులర్, 221 మంది ఫెయిలైన విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు.

Similar News

News July 6, 2025

కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి

image

కామారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటల నుంచి 1 వరకు ఉంటుందని చెప్పారు. ప్రజలు నేరుగా ప్రజావాణికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 6, 2025

పెద్దేముల్: ‘చదువు మధ్యలో మానేసిన యువతకు అవకాశం’

image

చదువుకోవాలని ఆశ ఉండి, చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ సువర్ణ అవకాశాలను కల్పిస్తుందని పెద్దేముల్ GHM సునీత పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో 25 ఓపెన్ స్కూల్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. పదో తరగతిలో చేరేందుకు 14 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారు, ఇంటర్‌లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.

News July 6, 2025

ఆంధ్ర మూలాలున్న పత్రికలను మేమెందుకు చదవాలి?: RSP

image

‘తెలంగాణ BRS జాగీరా?’ అంటూ వచ్చిన ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ ఫైరయ్యారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ‘తెలంగాణ జ్యోతి’గా పేరు మార్చుకోకుండా సర్కులేట్ అవుతోందని మండిపడ్డారు. విశాలాంధ్ర మన తెలంగాణగా, ప్రజాశక్తి నవ తెలంగాణగా పేరు మార్చుకున్నాయని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకుల తొత్తులకు వెన్నంటి నిలిచే ఆంధ్రమూలాలున్న పత్రిక/ఛానళ్లను TG ప్రజలు ఎందుకు చదవాలని ప్రశ్నించారు.