News March 14, 2025

MNCL: BRAOU సెమిస్టర్-1 హాల్ టికెట్లు విడుదల

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థులకు రిజిస్టర్ ఫోన్ నంబర్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.

Similar News

News December 9, 2025

సూర్యాపేటలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

image

సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, మెప్మా మహిళలు, ఆశా వర్కర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం అందరూ సమూహంగా “జయ జయహే తెలంగాణ” గీతాన్ని ఆలపించారు.

News December 9, 2025

బాపట్లలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

బాపట్లలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని చీలు రోడ్డు వద్ద లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న శివరామకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News December 9, 2025

మెటాకు షాక్.. 4 ఏళ్లలో $70 బిలియన్లు హాంఫట్

image

VR హెడ్ సెట్స్, స్మార్ట్ గ్లాసెస్‌తో గేమింగ్ కమ్యూనిటీకి చేరువకావాలనుకున్న మెటా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. నాలుగేళ్లలో 70 బిలియన్ డాలర్లు నష్టపోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రియాల్టీ ల్యాబ్స్ బడ్జెట్‌లో 30% కోత విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జనవరిలో లేఆఫ్స్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వాల్యూ పెరిగే వరకు MR గ్లాసెస్ లాంచ్‌‌ను పోస్ట్‌పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది.