News April 13, 2025

MNCL : BRS సిద్ధమా..పూర్వ వైభవం వచ్చేనా..!

image

రాష్ట్రంలో అధికారం కోల్పోయాక స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. MNCL, బెల్లంపల్లి, చెన్నూర్, ఖానాపూర్ శ్రేణులకు ఇప్పటికే జిల్లాధ్యక్షుడు సుమన్, Ex MLAలు దివాకర్‌రావు, చిన్నయ్య, ఖానాపూర్‌లో జాన్సన్‌నాయక్ దిశానిర్దేశం చేశారు. భారీగా తరలివెళ్లి సత్తా చూపించి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్..?

Similar News

News November 9, 2025

జడ్చర్లలో నకిలీ రూ.500 నోట్ల కలకలం

image

నకిలీ రూ.500 నోట్లతో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిని జడ్చర్ల మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో దుకాణ యజమాని పట్టుకున్నాడు. శనివారం దుకాణానికి వచ్చిన ఆ వ్యక్తి ఇచ్చిన మూడు నకిలీ రూ.500 నోట్లను యజమాని గుర్తించి నిలదీశాడు. వెంటనే యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News November 9, 2025

పల్నాడు యుద్ధం ఎక్కడ జరిగిందో తెలుసా..!

image

మినీ మహాభారతం, ఆంధ్ర కురుక్షేత్రంగా చరిత్రకెక్కించిన పల్నాడు యుద్ధం జరిగిన ప్రాంతం ఎక్కడో తెలుసా? పల్నాడు జిల్లా కారంపూడిలోని నాగులేరు వాగు ఒడ్డునే ఆ చారిత్రక ఘట్టం జరిగింది. యుద్ధంలో రక్తపుటేరులు ప్రవహించినట్లు చరిత్రకారులు చెబుతారు. వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, అప్పటి ఆయుధాలను పూజిస్తూ ఇక్కడ వీరుల గుడిని నిర్మించారు. ప్రతి ఏటా ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం.

News November 9, 2025

ఏలూరు జిల్లాలో పోలీసుల తనిఖీలు

image

ఏలూరు జిల్లాలోని జాతీయ రహదారులపై శనివారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రమాదాల నివారణలో భాగంగా హెవీ వాహన డ్రైవర్లకు ‘ఫేస్ వాష్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్‌లతో పరీక్షలు నిర్వహించారు. రాత్రివేళల్లో లాడ్జీలు, బస్సు, రైల్వే స్టేషన్లలో కొత్త వ్యక్తుల వివరాలను ఆరా తీసి, అనుమానాస్పదంగా ఉన్న వారిని ప్రశ్నించారు.