News April 13, 2025
MNCL : BRS సిద్ధమా..పూర్వ వైభవం వచ్చేనా..!

రాష్ట్రంలో అధికారం కోల్పోయాక స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. MNCL, బెల్లంపల్లి, చెన్నూర్, ఖానాపూర్ శ్రేణులకు ఇప్పటికే జిల్లాధ్యక్షుడు సుమన్, Ex MLAలు దివాకర్‌రావు, చిన్నయ్య, ఖానాపూర్‌లో జాన్సన్‌నాయక్ దిశానిర్దేశం చేశారు. భారీగా తరలివెళ్లి సత్తా చూపించి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్..?
Similar News
News February 22, 2026
నెల్లూరు: జైల్లో పొక్సో కేసు నిందితుడి మృతి.!

నెల్లూరు సెంట్రల్ జైల్లో పొక్సో కేస్ నిందితుడు మట్టి సుబ్బారావు (58) ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడ భవానిపురానికి చెందిన సుబ్బారావు పది నెలలుగా ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో శిక్ష అనుభవిస్తూ చనిపోయాడు. మృతదేహానికి ఆర్డీవో, MRO, వెంకటాచలం పోలీసులు సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.
News February 22, 2026
తీవ్ర విషాదం.. పెళ్లికి ముందురోజే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఒకే రోజు ఇద్దరు కూతుళ్ల పెళ్లి వైభవంగా చేసి సంతోషించాలనుకున్న తల్లిదండ్రులకు విషాదం ఎదురైంది. శనివారం వివాహం జరగాల్సి ఉండగా ముందు రోజు రాత్రి అక్కాచెల్లెళ్లు శోభ(25), విమల(23) విషం తాగారు. బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాత పోలీసులు బాడీలను ఫ్యామిలీకి అప్పగించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
News February 22, 2026
రాత్రి పూట తలస్నానం చేయకూడదా?

చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయం విశ్రాంతికి సంకేతం. అప్పుడు చన్నీటి స్నానంతో శరీరాన్ని అధికంగా చల్లబరిస్తే అనారోగ్యాలు వస్తాయని వద్దంటారు పండితులు. డాక్టర్లు సైతం ఇది మంచిది కాదంటున్నారు. ‘రాత్రిపూట సూర్యరశ్మి ఉండదు. దానివల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. అయినా తలస్నానం చేస్తే జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. తల ఆరడానికి సమయం పడుతుంది. దీంతో తలనొప్పి, సైనస్ రావొచ్చు’ అంటున్నారు.


