News February 4, 2025
MNCL: FEB 5 నుంచి సదరం శిబిరాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభత్వ ఆసుపత్రిలో ఈ నెల 5 నుంచి సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ తెలిపారు. 5న మూగ, చెవుడు, 11, 19 తేదీల్లో శారీరక దివ్యాంగులు, 25న మానసిక వికలాంగులు, 28న కంటి చూపు సమస్య ఉన్న వారు హాజరు కావాలని పేర్కొన్నారు. కొత్త సదరం సర్టిఫికెట్తో పాటు రెన్యూవల్ కోసం ఈ నెల 4 నుంచి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 7, 2025
సంగారెడ్డి: ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగేలా చూడాలి: మంత్రి

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వైద్య శాఖకు వచ్చిన గ్రూప్-1 అధికారులతో హైదరాబాద్లోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేదలు వస్తారని.. వారిపై ప్రేమ చూపించాలని పేర్కొన్నారు.
News November 7, 2025
రెండు శనివారాల్లో పనిపై పునరాలోచించండి: APTF

AP: తుఫాను కారణంగా స్కూళ్లకు ఇచ్చిన సెలవులకు పరిహారంగా రెండు శనివారాలు పనిచేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని ఏపీటీఎఫ్ కోరింది. 220 పనిదినాలు సర్దుబాటయ్యే స్కూళ్లను ఈ ఉత్తర్వుల నుంచి మినహాయించాలంది. అలాగే నవంబర్ 10న మూడో కార్తీక సోమవారం, 14న బాలల దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో సమ్మేటివ్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.
News November 7, 2025
పల్నాడు యుద్ధం ఎందుకు జరిగింది..!

పల్నాటి యుద్ధానికి దాయాదుల రాజ్యాధికార పోరు ప్రధాన కారణమని చరిత్రకారులు పేర్కొన్నారు. నలగామరాజు, మలిదేవరాజు మధ్య కోడిపందేలు జరిగాయి. ఓడిన మలిదేవరాజు ఏడేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత కూడా రాజ్యం ఇవ్వకపోవడం, రాయబారి హత్యతో ఈ భీకర సంగ్రామం మొదలైందని చెబుతుంటారు. దీనికి అదనంగా వైష్ణవ సంస్కర్త బ్రహ్మనాయుడు, శైవ సంప్రదాయవాది నాయకురాలు నాగమ్మల మధ్య మత, సామాజిక వైరుధ్యాలు తోడయ్యాయని పేర్కొన్నారు.


