News February 4, 2025

MNCL: FEB 5 నుంచి సదరం శిబిరాలు

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభత్వ ఆసుపత్రిలో ఈ నెల 5 నుంచి సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ తెలిపారు. 5న మూగ, చెవుడు, 11, 19 తేదీల్లో శారీరక దివ్యాంగులు, 25న మానసిక వికలాంగులు, 28న కంటి చూపు సమస్య ఉన్న వారు హాజరు కావాలని పేర్కొన్నారు. కొత్త సదరం సర్టిఫికెట్‌తో పాటు రెన్యూవల్ కోసం ఈ నెల 4 నుంచి మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 15, 2025

చేపల సాగులో ఆదర్శంగా నిలిచిన విజయ కుమారి

image

బాపట్ల జిల్లా నగరం మండలం పమిడిమర్రు గ్రామానికి చెందిన ఆక్వా రైతు విజయకుమారి పీఎంఎంఎస్‌వై పథకం ద్వారా చేపల సాగులో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ లబ్ధి పొందుతున్నట్లు జిల్లా మత్స్యశాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్ఏఎస్ టెక్నాలజీ ద్వారా తక్కువ నీటితో నాణ్యత గల చేపలను ఉత్పత్తి చేస్తూ లాభాలు గడిస్తున్నారని పేర్కొంది. పలువురు ఆక్వా రైతులకు ఆమె ఆదర్శంగా నిలిచారని కొనియాడింది.

News November 15, 2025

ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి: ఎస్.కోట సీఐ

image

ఎస్.కోట అగ్నిమాపక కేంద్రంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ (39) వెన్ను, కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు CI నారాయణ మూర్తి తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. సెలవుపై ఇంటిలోనే ఉంటున్నాడు. ఈనెల 13న పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అతని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News November 15, 2025

యూపీఐతో టోల్ చెల్లింపు.. ఛార్జీ భారీగా తగ్గింపు!

image

ఫాస్టాగ్ పనిచేయని, చెల్లుబాటు కాని వాహనదారులకు భారీ ఉపశమనం దక్కింది. ఫాస్టాగ్ లేకుంటే నేషనల్ హైవేలపై గతంలో టోల్ గేట్ల వద్ద రూ.100 చెల్లించాల్సి ఉంటే రూ.200 వరకు ఛార్జీ వసూలు చేసేవారు. అయితే నేటి నుంచి UPI ద్వారా పేమెంట్స్ చేస్తే రూ.100కు 25% అదనంగా అంటే రూ.125 చెల్లించి వెళ్లిపోవచ్చు. ఈ విధానం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే క్యాష్ ఇవ్వాలనుకుంటే రూ.100కు రూ.200 చెల్లించాల్సిందే.