News April 5, 2025
MNCL: GREAT.. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!

మంచిర్యాల పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాలలో 1975లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. తాము చదువుకున్న పాఠశాలకు అవసరమైన 30 ఫర్నీచర్ కుర్చీలు, ఫోడియం, విద్యార్థులకు డిక్షనరీలు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. పూర్వ ఉపాధ్యాయులను సత్కరించి, మోమెంటోలు ప్రదానం చేశారు. నిర్వాహకులు రాజగోపాల్, వి.మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 24, 2025
దీపం ఇలా పెట్టాలి: పండితులు

దీపారాధనలో ముందుగా నూనె పోయాలి. ఆ తర్వాతే వత్తులు వేయాలి. వెండి, పంచలోహ, ఇత్తడి, మట్టి కుందులను కడిగిన తర్వాతే వాడాలి. స్టీలు కుందులను వాడకూడదు. కుందులను నేరుగా కింద పెట్టకుండా పళ్లెం/తమలపాకుపై ఉంచాలి. అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగించకూడదు. ఏక హారతిలో కర్పూరం లేదా అడ్డవత్తిని వెలిగించి, దాని సహాయంతోనే దీపారాధన చేయాలి. దీపం నుంచి అగరవత్తులను, ఇతర హారతులను ఎప్పుడూ వెలిగించకూడదని శాస్త్ర వచనం.
News December 24, 2025
వాళ్లకు పెన్షన్లు కట్!

TG: పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం చేపట్టిన సోషల్ ఆడిట్‌లో బయటపడింది. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా 20వేల శాంపిల్స్ సేకరిస్తే అందులో 2వేల మంది అనర్హులుగా తేలింది. ధనవంతులు, 50ఏళ్లు నిండని వారు, వైకల్యం లేకున్నా దివ్యాంగ పెన్షన్లు, చనిపోయినవాళ్లపై ఇతరులు ఇలా అక్రమంగా చేయూత పొందుతున్నట్లు గుర్తించారు. వీళ్లందరికీ పెన్షన్లు కట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
News December 24, 2025
ALL SET: 8.54amకు నింగిలోకి..

AP: LVM3-M6 రాకెట్ ప్రయోగానికి తిరుపతి(D) శ్రీహరికోటలోని SDSC సిద్ధమైంది. 8:54amకు USకు చెందిన 6,100KGల బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత్ నుంచి లోఎర్త్ ఆర్బిట్(LEO)లోకి పంపనున్న అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు ఇది నేరుగా 4జీ, 5జీ సిగ్నల్స్ అందించి మొబైల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.


