News April 18, 2024

MNCL: IPL క్రికెట్ బెట్టింగ్..పోలీసుల అదుపులో పది మంది

image

మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద దగ్గర ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మందిని బుధవారం సాయంత్రం పట్టుకున్నట్లు పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్స్ రూ.10 వేలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. IPL క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని, బెట్టింగ్ ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News January 11, 2025

సీఎంతో సమావేశంలో పాల్గొన్న నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు.

News January 11, 2025

నిర్మల్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా అల్ప సంఖ్యాకవర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ అధికారి మోహన్‌సింగ్ తెలిపారు. మైనారిటీ అభ్యర్థులకు 4నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి15లోపు ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయధ్రువపత్రాలతో జిల్లా మైనారిటీ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 10, 2025

నిర్మల్ : రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలకు (కేజీబీవీ మినహా) ఈనెల 11 నుంచి సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని డీఈవో రామారావు తెలిపారు. అకడమిక్‌ క్యాలెండర్‌లో ఈనెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులొచ్చాయని తెలిపారు. ఈనెల 18న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయన్నారు.ః