News April 3, 2025
MNCL: KU.. గడువు మరోసారి పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేటితో ఈ గడువు ముగియనుండగా ఏప్రిల్ 7 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News October 24, 2025
బాధిత కుటుంబాలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కర్నూల్ జిల్లా కల్లూరులో బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. బాధిత కుటుంబాలు ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చాన్నారు. GDL కలెక్టరేట్ 9502271122, హెల్ప్ డెస్క్ 9100901599, 9100901598, కర్నూల్ GGH 9100901604, GDL పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ 8712661828.
News October 24, 2025
వంటింటి చిట్కాలు

* పకోడీలు చేసేటప్పుడు పిండిలో కొంచెం సోడా కలిపితే అవి బాగా పొంగుతాయి.
* వెల్లుల్లిని దంచి నీటిలో కలిపి.. బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట పెడితే వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు.
* కూరలో నూనె ఎక్కువైతే రెండు బ్రెడ్ ముక్కలను పొడి చేసి వేయడం వల్ల నూనెను పీల్చుకోవడంతో పాటు, కూర రుచిగా ఉంటుంది.
* చేతులకు కొబ్బరినూనె రాసుకొని పచ్చిమిర్చి కోస్తే, చేతులు మండవు.
News October 24, 2025
స్వాతి కార్తె అంటే ఏంటి?

27 నక్షత్రాల ఆధారంగా రైతులు ఏర్పరచుకున్న కార్తెల్లో ఇదొకటి. సూర్యుడు స్వాతి నక్షత్రానికి దగ్గరగా ఉన్న సమయాన్ని ఈ కార్తె సూచిస్తుంది. ఇది OCT 24 నుంచి NOV 6 వరకు ఉంటుంది. ఈ కార్తెలో పడే వర్షాలను ‘స్వాతి వానలు’ అంటారు. ఈ వర్షాలు వరికి ప్రతికూలం. మెట్ట పంటలకు అనుకూలం. ‘చిత్త చిత్తగించి, స్వాతి చల్లజేసి’ అనే సామెత ఈ వర్షాల ప్రాముఖ్యతను తెలుపుతుంది. వరి కోతలు, రబీ జొన్న సాగు పనులు ఇప్పుడు మొదలవుతాయి.


