News February 11, 2025

MNCL: MLC అభ్యర్థిగా నామినేషన్ వేసిన శేఖర్‌రావు

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు నామినేషన్ వేశారు. జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన యాదగిరి శేఖర్ రావు సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందించారు. శేఖర్ రావు మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడానికి తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు.

Similar News

News November 18, 2025

పోక్సో కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష: ASF SP

image

మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన, అత్యాచారయత్నం కేసులో కోర్టు నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.12,000 జరిమానా విధించినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. 2020లో బెజ్జూర్‌లో జరిగిన ఈ ఘటనపై నమోదు చేసిన కేసును ప్రత్యేక కోర్టు పరిశీలించి నిందితులకు శిక్ష విధించిందన్నారు.

News November 18, 2025

బాపట్ల: ‘కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత’

image

పర్యావరణ అనుమతులు, వాల్టా చట్టం ఆధారంగా ఇసుక రేవులు అనుమతించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం బాపట్ల కలెక్టరేట్‌లో జరిగింది. కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత ఉందని కలెక్టర్ చెప్పారు. కొల్లూరు మండలం జువ్వలపాలెం ఇసుక రేవులో 14.960 హెక్టార్ల ఇసుక లభ్యత ఉందని స్పష్టం చేశారు. స్థానికుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు.

News November 18, 2025

పార్వతీపురం జిల్లాలో 1,22,260 మంది అర్హులు: కలెక్టర్

image

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద జిల్లా వ్యాప్తంగా రూ.83.87 కోట్ల నిధులు 1,22,260 మంది రైతుల ఖాతాల్లో బుధవారం జమ కానున్నట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. పాలకొండ నియోజకవర్గంలో రూ.22.75 కోట్లు, కురుపాం నియోజకవర్గంలో రూ.26.94 కోట్లు, పార్వతీపురం నియోజకవర్గంలో రూ.17.20 కోట్లు, సాలూరు నియోజకవర్గంలో రూ.16.98 కోట్లు మొత్తం రూ.83.87 కోట్ల నిధులు విడుదల కానున్నట్లు తెలిపారు.