News February 2, 2025
MNCL: MLC ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి:SEO

శాసనమండలి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 13, 2025
గుమ్మం ముందు కూర్చొని ఈ పనులు చేస్తున్నారా?

ఇంటి గుమ్మంపై కూర్చోవడం, జుట్టు దువ్వడం, తినడం, అడుగు పెట్టడం వంటి పనులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుందని అంటున్నారు. అలాగే తలుపు దగ్గర ఓ కాలు లోపల, మరో కాలు బయట పెట్టి నిలబడటం కూడా మంచిది కాదని చెబుతున్నారు. గుమ్మాన్ని కూడా దైవంలా భావించాలని, పూజించాలని ఫలితంగా శుభం కలుగుతుందని వివరిస్తున్నారు. SHARE IT
News December 13, 2025
14 నుంచి తిరుపతి ఐఐటీలో ఇంటర్ స్పోర్ట్స్

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ 14వ తేదీ నుంచి 21 తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐఐటీ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. చెస్, టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఐకాన్ వెయిట్ లిఫ్టర్ సతీష్ శివలింగం హాజరుకానున్నారు.
News December 13, 2025
రానున్న 3 రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి (D) కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 5.8°C నమోదైంది. సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది.


