News February 18, 2025

MNCL: MLC ఎన్నికల్లో విజయం బీజేపీదే: బండి సంజయ్

image

రాష్ట్రంలో ఈ నెల 27న జరగబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసం, భరోసా, ప్రజల పక్షాన బీజేపీ చేసిన పోరాటం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ గెలుపునకు బాటలు అని పేర్కొన్నారు.

Similar News

News April 19, 2026

చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

image

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News April 19, 2026

అల్లికలతో వ్యసనాలకు చెక్!

image

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.

News April 19, 2026

రేపు యథావిధిగా ‘మీకోసం’: కలెక్టర్‌

image

అమలాపురంలో సోమవారం పీజీఆర్ఎస్ మీకోసం, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రంలో మీకోసం కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు.